తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని మాజీ మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదల కోసం తెదేపా ప్రభుత్వ హయాంలో ఇళ్లు నిర్మిస్తే వైకాపా ప్రభుత్వం వాటిని పేదలకు మంజూరు చేయలేదని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం వాలుతిమ్మాపురంలో గృహసముదాయాల వద్ద తెదేపా నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇళ్లు పేదలకు ఇవ్వాలని చిన రాజప్ప డిమాండ్ చేశారు.
'తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వాలి' - పేదలకు ఇళ్ల గృహాలు
రాష్ట్ర వ్యాప్తంగా పేదల కోసం తెదేపా ప్రభుత్వ హయాంలో ఇళ్లు నిర్మిస్తే వైకాపా ప్రభుత్వం వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. ప్రభుత్వం తక్షణం ఆ ఇళ్లు పేదలకు ఇవ్వాలని చినరాజప్ప డిమాండ్ చేశారు.
!['తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వాలి' tdp protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7915186-346-7915186-1594041944792.jpg)
తెదేపా నిరసన