ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం సార్... ప్రజల్లోకి వస్తే వారి బాధలు తెలుస్తాయ్' - వైసీపీపై చినరాజప్ప కామెంట్స్

సీఎం జగన్​.. బయటకు వస్తే లాక్​డౌన్​తో ప్రజలు పడుతున్న బాధలు అర్థమౌతాయని మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. ఇంట్లోనే కూర్చొని సమీక్షలు చేస్తున్న సీఎం... కనీసం మీడియా ముందుకూ రావటం లేదని విమర్శించారు. లాక్​డౌన్ నిబంధనలు పాటిస్తున్న చంద్రబాబుపై వైకాపా నేతలు కావాలనే విమర్శలు చేస్తున్నారన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు ఇంట్లో ఉన్నా బాధ్యతాయుతంగా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు.

chinarajappa
chinarajappa

By

Published : Apr 19, 2020, 6:59 PM IST

మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి చినరాజప్ప

సీఎం జగన్‌ బయటకు వస్తే కరోనా తీవ్రత ఎలా ఉందో తెలుస్తుందని మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. లాక్​డౌన్​తో బాధలు పడుతున్న ప్రజల్ని వైకాపా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెదేపా అధినేత చంద్రబాబు బయటకు రావటం లేదంటున్న వైకాపా నేతలు.. సీఎం జగన్ ఎప్పుడు బయటకు వచ్చి తిరిగారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. లాక్​డౌన్ నిబంధనలు పాటిస్తూ హైదరాబాద్ ఇంట్లోనే ఉన్న చంద్రబాబు.. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, తగిన సూచనలు చేస్తున్నారన్నారు. సమీక్షలు చేస్తున్న జగన్.. కనీసం మీడియా ముందుకు రావడం లేదని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details