ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎవరినీ వైకాపాలోకి తీసుకోబోనని చెప్పిన జగన్... ఇప్పుడెందుకు ప్రోత్సహిస్తున్నారని తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప ప్రశ్నించారు. వాసుపల్లి గణేష్‌ను వైకాపాలోకి ఆహ్వానించడం అనైతికమని వ్యాఖ్యానించారు. గణేష్ వెళ్లడం వల్ల తెదేపాకి వచ్చిన నష్టం ఏమీలేదని పేర్కొన్నారు. తల్లిలాంటి పార్టీని వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. తాను గెలిచింది చంద్రబాబు కారణంగానే అనే విషయం గణేష్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. విశాఖ అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషి ఫలితంగానే విశాఖలో తెదేపా గెలిచిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలను విస్మరించారని ధ్వజమెత్తారు.
'వాసుపల్లి గణేష్ తల్లిలాంటి తెదేపాకి అన్యాయం చేశారు' - chinarajappa comments on chandrababu
జగన్ సీఎం అయ్యాక.. తాము ఎవరినీ వైకాపాలోకి తీసుకోబోమని, ఒకవేళ ఎవరైనా వచ్చినా వారి శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతే ఆహ్వానిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి ఇప్పుడు మాట తప్పారని తెదేపా కీలక నేత చినరాజప్ప విమర్శించారు. వాసుపల్లి గణేష్... తల్లి లాంటి తెదేపాకి అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. గణేష్ వెళ్లినంత మాత్రాన తెదేపాకు ఎలాంటి నష్టం ఉండబోదని వ్యాఖ్యానించారు. పెద్దాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
చినరాజప్ప