కరోనాపై కాకుండా ఇతర విషయాలపై సీఎం జగన్ శ్రద్ధ చూపిస్తున్నారని మాజీహోంమంత్రి చినరాజప్ప ఆరోపించారు. విపత్కర పరిస్థితుల్లో రాజధానిపై మాట్లాడడం అవసరమా..? అని ప్రశ్నించారు. ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న వైద్యులకు వసతులు లేవన్నారు. కరోనా పరీక్షలు చేసేందుకు సరిపడా ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా ఖర్చుల కింద పురపాలక సంఘాలకు నిధులు ఇవ్వాలన్న చినరాజప్ప... వలస కూలీలకు వసతి, భోజన సదుపాయం కల్పించాలని కోరారు.
'కరోనాపై కాకుండా ఇతర విషయాలపై శ్రద్ధ చూపిస్తున్నారు' - చినరాజప్ప వార్తలు
ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్న వైద్యులకు వసతులు లేవని తెదేపా సీనియర్ నేత చినరాజప్ప పేర్కొన్నారు. కరోనా ఖర్చుల కింద పురపాలక సంఘాలకు నిధులు ఇవ్వాలన్న చినరాజప్ప... వలస కూలీలకు వసతి, భోజన సదుపాయం కల్పించాలని కోరారు.
చినరాజప్ప
Last Updated : Apr 17, 2020, 3:02 PM IST