"జగన్ ప్రభుత్వ వైఖరితో దిశ ఆత్మ ఘోషిస్తుంది. పోలీసులు-వైకాపా నేతలు కుమ్మక్కై ఏపీని దక్షణాది బిహార్ గా మారుస్తున్నారు. దళిత మెజిస్ట్రేట్ రామకృష్ణను, డాక్టర్ సుధాకర్ లను ఉద్దేశించి ‘వాడు, వీడు’ అన్న పెద్దిరెడ్డి వ్యాఖ్యలు వైకాపా ప్రభుత్వానికి దళితులపై ఎంత చిత్తశుద్ది ఉందో తెలుస్తుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన సుభాష్ చంద్రబోస్ ఇంటికి అర్ధరాత్రి అక్రమంగా వెళ్లడం ఏ వైకాపా నేతల ఒత్తిడితో జరిగింది? ఇసుక మాఫియా రాష్ట్రంలో ఎలా పేట్రేగిపోతుందో చెప్పడానికి తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడు వరప్రసాద్ పై జరిగిన దాడి ప్రత్యక్ష నిదర్శనం. వరుసగా ఇలా జరగడానికి కారణం జగన్ మోహన్ రెడ్డి మౌనమే కారణం. జిల్లా అధికారులపై, వారిని ఆడించిన వైకాపా నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి"- తెదేపా నేత, మాజీ మంత్రి చినరాజప్ప
జగన్ ప్రభుత్వ వైఖరితో దిశ ఆత్మ ఘోషిస్తుంది: చినరాజప్ప - మాజీ మంత్రి చినరాజప్ప తాజా వార్తలు
వైకాపా ప్రభుత్వ వైఖరిపై తెదేపా నేత చినరాజప్ప తీవ్రంగా మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం వైఖరితో దిశ ఆత్మ ఘోషిస్తుందని ఆరోపించారు. దళిత యువకుడు వరప్రసాద్‌పై జరిగిన దాడే ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు.
chinarajappa comments