ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కుట్రలు, కుతంత్రాలతో వైకాపా పాలన' - పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప

కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రంలో పాలన సాగుతోందని పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో వైకాపా శ్రేణులు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. వాటిని మానుకోవాలని చినరాజప్ప తెలిపారు.

పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప

By

Published : Jun 29, 2019, 1:35 PM IST

పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప

రాష్ట్రంలో కుట్రలు, కుతంత్రాలతో పాలన సాగుతోందని మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తెదేపా శ్రేణులపై బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. కాకినాడలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన.. జగన్ నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నక్యాంటీన్లు, శిలాఫలకాల ధ్వంసం వంటి చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. శాంతి భద్రతల సమస్యపై డీజీపీని కలవబోతున్నట్టు చెప్పారు. నిర్మాణాలను వీలైతే క్రమబద్ధీకరించాలే తప్ప.. భవనాలను ధ్వంసం చేయడం సరికాదని హితవు పలికారు. తెదేపా ఓ విశ్వ విద్యాలయంలాంటిదని... ఎంతమంది నాయకులు వెళ్లిపోయినా కొత్త నాయకత్వం పుట్టుకొస్తుందని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details