తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అర్థమూరుకి చెందిన అక్కా తమ్ముళ్లు సబ్బేళ్ల సాయి కీర్తన, సత్య గోపాల రెడ్డి డిగ్రీ చదువుతున్నారు. కరోనాతో పనులు లేక బాధలు పడుతున్న పేదల కోసం తమ వంతు సహాయం చేయాలనుకున్నారు. తాము దాచుకున్న రూ. లక్షా యాభై వేలు వెచ్చించి ప్రజలకు నిత్యావసరాలు ఇద్దామనుకున్నారు. వీరి నిర్ణయానికి తల్లిదండ్రులు శ్రీనివాస రెడ్డి, సుజాత అంగీకరించారు. గ్రామంలోని సుమారు 400 కుటుంబాలకి బియ్యం, కిరాణా, కూరగాయలు... జాతీయ నెక్ కమిటీ సభ్యులు పడాల సుబ్బారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి చేతులు మీదుగా ప్రజలకు అందజేశారు. సహాయం చేయగలిగే ప్రతి ఒక్కరూ ఈ అక్కా తమ్ముళ్లను ఆదర్శంగా తీసుకోవాలని వారు అభిలాషించారు.
నిరుపేదలకు నిలయం... ఈ అక్కా తమ్ముళ్లు - అర్థమూరులో పేదలకు నిత్యావసరాలు పంపిణీ
వారు వయసులో చిన్నవారే..కానీ దానగుణంలో మాత్రం పెద్దవారని నిరూపించుకున్నారో అక్కా తమ్ముళ్లు. చదువుకునే వయసులోనే పేదల కోసం ఆలోచించి ఊరు మొత్తం గర్వించేలా చేశారు. ఇంతకీ ఏం చేశారో తెలుసుకుందాం పదండి!
అర్థమూరులో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తోన్న అక్కాతమ్ముళ్లు