బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు - తూర్పుగోదావరి
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని జగ్గయ్యచెరువు ప్రాంతంలో ఐసిడిఎస్ అధికారులు బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు.తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పెళ్లి వాయిదా వేయించారు.
![బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2675815-387-d3be6950-b6fb-4586-8a09-e57558fd756b.jpg)
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని జగ్గయ్యచెరువు ప్రాంతంలో ఐసిడిఎస్ అధికారులు బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. 9వ తరగతి చదువుతున్న బాలికకు అల్లవరం మండలం గుడ్డోడిచింత గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం కుదిర్చారు. బాలిక తల్లిదండ్రులు వివాహానికి ఏర్పాట్లు చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఐసీడీఎస్ అధికారులు విహహాన్ని నిలుపుదల చేసి బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని అవగాహన కల్పించి వివాహాన్ని వాయిదా వేశారు. వివాహాన్ని నిలుపుదల చేస్తున్నట్లు తల్లిదండ్రులతో పూచీకత్తు రాయించుకున్నారు.