ఉభయ గోదావరి జిల్లాల్లో గోదావరి నది కోత నివారణ, ఇతర అభివృద్ధి పనులు కోసం జలవనరుల శాఖకు ఆరు వందల కోట్ల రూపాయలు విలువైన పనుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు తూర్పు గోదావరి జిల్లా జలవనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్.రామకృష్ణ వెల్లడించారు. ప్రభుత్వం నియమించిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ బృందం ఉభయగోదావరి జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో జనవరి 5 నుంచి 8 వరకు పర్యటిస్తారని ఆయన చెప్పారు.
గోదావరి నది కోత నివారణకు ప్రతిపాదనలు.. - పి.గన్నవరం నియోజకవర్గం తాజా వార్తలు
గోదావరి నది కోత నివారణ, ఇతర అభివృద్ధి పనులు కోసం రూ. 600 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తూర్పు గోదావరి జిల్లా జలవనరుల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్.రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ బృందం జనవరి 5 నుంచి 8 వరకు నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనుందని ఆయన చెప్పారు.
పి.గన్నవరం నియోజకవర్గం కె.ముంజవరం వద్ద ముప్పై నాలుగు లక్షల రూపాయల నిధులతో జరుగుతున్న అవుట్ ఫ్లో స్లూయిస్ తలుపుల పనులను ఆయన పరిశీలించారు. అదేవిధంగా కోడేరు లంక, రాయలంక తదితర ప్రాంతాల్లో నది కోత ప్రదేశాలను సందర్శించారు. జనవరి 5 నుంచి 8వ తేదీ వరకు పర్యటించే టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి నది కోత ప్రదేశాలను గేటు గట్లను చూపించనున్నట్లు ఆయన తెలిపారు. కమిటీ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. హెడ్ వర్క్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్ మోహన్ రావు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ ఆయన వెంట ఉన్నారు.
ఇదీ చదవండి:పోలవరం తాజా ధరలపై కేంద్ర జల సంఘం సానుకూలం