ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్​ సభకు పి.గన్నవరం ఉన్నత పాఠశాల ముస్తాబు - సీఎం జగన్​

పి.గన్నవరంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా.. ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ప్రధాన వేదికైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గోడల మీద 300 బొమ్మలు వేశారు.

p-gannavaram
పి.గన్నవరం ఉన్నత పాఠశాల

By

Published : Aug 15, 2021, 4:14 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.. సోమవారం పర్యటించనున్నారు. అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నాడు నేడు కార్యక్రమం కింద అభివృద్ధి చేసిన పి.గన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వేదికగా చేసుకుని ముఖ్యమంత్రి కార్యక్రమం కేంద్రీకృతమై ఉంది. ఈ క్రమంలో.. జిల్లా కలెక్టర్ హరి కిరణ్ నేతృత్వంలో ఇక్కడ ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి.

పాఠశాల గోడలమీద సుమారు 300 బొమ్మలు కనువిందు చేస్తున్నాయి. సభా వేదికను అత్యంత భారీగా ఏర్పాటు చేస్తున్నారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దుతున్నారు. ఈ రాత్రికి మొత్తం పనులు పూర్తవుతాయి. ఇప్పటికే మంత్రులు రెండు సార్లు వచ్చి ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక శాసన సభ్యుడు కొండేటి చిట్టిబాబు దగ్గర ఉండి ఏర్పాట్లు చూస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details