ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరగంటలో రూ.అరలక్ష మాయం - రాజమహేంద్రవరం క్రైమ్ వార్తలు

సాఫ్​వేర్ ఇంజనీర్​ని మాటల్లో పెట్టి అరలక్ష కొట్టేశాడు ఓ కేటుగాడు. బ్యాంకు ఖాతా అప్​డేట్ చేయాలని చెప్పి.. యాప్ డౌన్ లోడ్ చేయించి మరీ బురిడీ కొట్టించాడు. అరగంటలో అరలక్ష కొట్టేశాడు.

crime
crime

By

Published : Oct 3, 2020, 2:16 PM IST

ఫోనులో మాయమాటలు చెప్పి ఆన్‌లైనులో నగదు చోరీ చేసిన ఘటనపై రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక విద్యానగర్‌ ప్రాంతానికి చెందిన వీవీఎన్‌ ప్రవీణ్‌ ఓ ప్రైవేటు సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. అతడికి గురువారం సాయంత్రం ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌ చేసి బ్యాంకు ఖాతా కేవైసీ అప్‌డేట్​‌ చేయాలన్నాడు. మాటల్లో పెట్టి ఫోన్‌కు ఓ యాప్‌ లింక్‌ పంపాడు. దానిని క్లిక్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని సూచించాడు. ప్రవీణ్‌ ఆ యాప్‌ను తన ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేసిన అరగంట వ్యవధిలో అతని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.52 వేలు డ్రా అయ్యాయి. ఆ మొత్తం మూడు దఫాలుగా డ్రా అయినట్లు ఫోన్‌కు సంక్షిప్త సందేశాలు రావడంతో బాధితుడు బ్యాంకు వారిని సంప్రదించాడు. తాము ఎటువంటి సందేశాలు పంపలేదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో.. మోసపోయానని తెలుసుకున్న ప్రవీణ్‌ మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details