తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో గణపతి నిమజ్జనాన్ని వినూత్నంగా ఏర్పాటు చేశారు. కుమారీ టాకీస్ రేవు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫంట్ల పైనుంచి విగ్రహాలను గోదావరిలో నిమజ్జనం చేశారు. ఇందులో దేశభక్తిని చాటుతూ చంద్రయాన్-2 నమూనాతో యువకులు వాహనాన్ని తయారు చేశారు.ఈ ప్రత్యేక వాహనంపై గణేషుడిని ఊరేగిస్తూ నిమజ్జనం చేశారు.. ఈ కార్యక్రమం మహేంద్రసంఘం మేధరుల ఆధ్వర్యంలో జరిగింది. యువత తీన్‌మార్ డప్పులకు డాన్సులు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతుండటంతో పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.
ఘనంగా వినాయక నిమజ్జనం..ప్రత్యేక ఆకర్షణగా చంద్రయాన్ 2 నమూనా - Chandrayan2_Ganesh
రాజమహేంద్రవరంలో గణేష్ నిమజ్జనం ఉత్సాహంగా జరుగుతోంది. గోదావరిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల పైనుంచి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు.
చంద్రయాన్ 2 నమూనా ప్రత్యేక వాహనంపై... గణేషుని ఊరేగింపు.
TAGGED:
Chandrayan2_Ganesh