అవహేళనలు, ఆరోపణలను ఎదుర్కొంటూనే పోలవరం ప్రాజెక్టు 70 శాతం నిర్మాణం పూర్తిచేశామని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరానికి పునాదులే పడలేదని పాదయాత్రలో జగన్ ఎగతాళి చేశారని గుర్తు చేసిన చంద్రబాబు... మిగిలిన 30 శాతం పూర్తి చేయకపోతే పోలవరం కలగానే మిగిలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రివర్స్ స్లూయిజ్ గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల వరద మళ్లించిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న కంపెనీలకు వెనక్కి వెళ్లిపోవాలంటూ నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో... ప్రాజెక్ట్ నిర్మాణం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, దూరదృష్టి అర్థమవుతోందని పేర్కొన్నారు.
పోలవరంపై ఇదేనా ప్రభుత్వ చిత్తశుద్ధి..?
వరద సమయంలో పోలవరం ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న కంపెనీలకు 'వెనక్కు వెళ్లిపోవాలి' అంటూ... నోటీసులు ఇచ్చారంటే, ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి, దూరదృష్టి ఏపాటిదో అర్థం అవుతోందని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ట్వీట్ చేశారు.
చంద్రబాబు ట్వీట్