త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు తెదేపా అధినేత అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యారు. రాజమహేంద్రవరం లోకసభ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై నాయకులతో చర్చించారు. రాజమహేంద్రవరం లోక్సభ స్థానం కింద 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ల కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలు, పోటీ కోసం ఆశగా ఉన్న నేతల మధ్య పోటీ నెలకొంది.
రాజమహేంద్ర'వరం' ఎవరికో!
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు తెదేపా అధినేత అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యారు. రాజమహేంద్రవరం లోకసభ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ఖరారుపై నాయకులతో చర్చించారు.
అనపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యేగా రామకృష్ణరెడ్డి...రాజనగరం - పెందుర్తి వెంటేశ్ ఉన్నారు. రాజమహేంద్రవరం అర్బన్నియోజకవర్గానికి ఆదిరెడ్డి అప్పారావు, చల్లా శంకర్రావు మధ్య తీవ్ర పోటీ నెలకొంది.రాజమహేంద్రవరం గ్రామీణ స్థానంలో ప్రస్తుతం బుచ్చయ్య చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు స్థానంలో ఎమ్మెల్యేగా మంత్రి జవహర్ ఉన్నారు. ఇక్కడ పోటీలో వేమగిరి వెంకట్రావు, టీవీ రామారావు కూడా టికెట్ ఆశిస్తున్నారు.
నిడదవోలులో సీటుకోసం శేషారావు, కుందూరు సత్యనారాయణ పోటీ పడుతున్నారు. గోపాలపురం టికెట్ కోసం వెంటేశ్వరరావు, వెంకట్రాజు మధ్య పోటీ నెలకొంది.
వీరందరి అభ్యర్థిత్వం విషయంలో చంద్రబాబు మంతనాలు చేస్తున్నారు.