ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వం కంటే మీరే నయం.. ధర్మాడి సత్యానికి చంద్రబాబు లేఖ - godavari boat acciden news

గోదావరిలో మునిగిన రాయల్‌ వశిష్ఠ బోటుని వెలికితీసిన ధర్మాడి సత్యాన్ని అభినందిస్తూ తెదేపా అధినేత చంద్రబాబు ఆయనకు లేఖ రాశారు.

chandrababu letter to dharmadi satyam

By

Published : Oct 24, 2019, 9:46 AM IST

బోటు ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్న తపన, మునిగిపోయిన పడవను బయటకు తీయాలన్న పట్టుదల ప్రశంసనీయమని ధర్మాడి సత్యానికి చంద్రబాబు లేఖ రాశారు. పడవను వెలికి తీసేందుకు చూపిన శ్రద్ధలో ఒక్క శాతమైనా ప్రభుత్వం కనబరిచి ఉంటే, బాధిత కుటుంబాలకు ఈ దురవస్థ వాటిల్లేది కాదని అభిప్రాయపడ్డారు. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణంగానే కచ్చులూరు పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలూ దొరకని దుస్థితి ఏర్పడిందని లేఖలో పేర్కొన్నారు. విపత్తులలో బాధితుల్ని వదిలేసి దేశ విదేశాలకు విహారయాత్రలకు వెళ్లారని.. జడివానలో బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడిచేందుకు, భౌతికకాయాలను వారికి అప్పగించేందుకు పడిన తపనను తెదేపా మనస్ఫూర్తిగా అభినందిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details