తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గ సమావేశానికి రామచంద్రాపురం ఇంఛార్జి తోట త్రిమూర్తులు రాకపోవడాన్ని తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. ఆయన రాకపోయినా నియోజకవర్గంనుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, పార్టీ అభిమానులు సమావేశానికి తరలివచ్చారు. పత్తిపాడు నియోజకవర్గ ఇంఛార్జి వరపుల రాజా ఇటీవలే పార్టీ వీడిన కారణంగా ఆయన లేకుండానే కార్యకర్తలు, అభిమానులు భేటీకి హాజరయ్యారు. తోట త్రిమూర్తులు పార్టీ మారడం ఖాయమనే ప్రచారం బలపడుతున్నందున ప్రత్యామ్నాయం ఏంటనే దానిపై అధినేత చంద్రబాబు ముఖ్యనేతలతో సమాలోచనలు జరిపారు. చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తోట త్రిమూర్తులును పార్టీనుంచి సస్పెండ్ చేసి... కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయం శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో అధినేత నిర్ణయం ఏమిటన్నది ఆసక్తిగా మారింది.
సమావేశాలకు తోట డుమ్మా..నేతలతో చంద్రబాబు సమాలోచనలు - 'తోట త్రిమూర్తులు' విషయంలో ఏం చేద్దాం: చంద్రబాబు
తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గ సమావేశానికి రామచంద్రాపురం ఇంఛార్జి తోట త్రిమూర్తులు రాకపోవడాన్ని చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. ఆయనను పార్టీనుంచి సస్పెండ్ చేసి కొత్తవారికి బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయం శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నా.. ఈ పరిస్థితుల్లో అధినేత నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
![సమావేశాలకు తోట డుమ్మా..నేతలతో చంద్రబాబు సమాలోచనలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4356038-719-4356038-1567760216443.jpg)
'తోట త్రిమూర్తులు' విషయంలో ఏం చేద్దాం: చంద్రబాబు