గురజాడ అప్పారావుకు చంద్రబాబు, లోకేశ్ నివాళులు - గురజాడ అప్పారావుకు చంద్రబాబు, లోకేశ్ నివాళులు
గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా చంద్రబాబు, నారా లోకేష్ నివాళులర్పించారు. తెలుగువారు గర్వించే రచయిత గురజాడ అప్పారావని కొనియాడారు.
గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆయనకు నివాళులర్పించారు. 'వట్టి మాటలు కట్టిపెట్టోయ్...,గట్టిమేల్ తలపెట్టవోయి' అన్న మాటలను తానే గురజాడ ఆచరణలో పెట్టారని కొనియాడారు. గురజాడ జయంతి సందర్భంగా ఆ మహనీయుని మానవతా స్ఫూర్తిని, దేశభక్తిని స్మరించుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగువారు గర్వించే రచయిత గురజాడ అప్పారావని లోకేశ్ కీర్తించారు. తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన దేశభక్తుడు, మహాకవి గురజాడ అని కొనియాడారు.
TAGGED:
గురజాడ అప్పారావు జయంతి