ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆంధ్రాపై కేంద్రం చిన్నచూపు: చలసాని - విద్యార్థి జేఏసీ

ఆంధ్రప్రదేశ్​పై కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఆంధ్రా ప్రత్యేక సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ ఉద్యమిస్తామని తెలిపారు. కాకినాడలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.

జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ

By

Published : Jul 16, 2019, 7:56 PM IST

జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ
ఆంధ్రాకు ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూతూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నేత రవితేజతో కలిసి చలసాని శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్​పై కేంద్రం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.బడ్జెట్​లో రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్డు విషయంలోనూ కేంద్రం నిర్లక్ష్యంగా వ్వవహరిస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details