పిల్లలు చిన్నప్పటి నుంచి దేశభక్తి కలిగి ఉండాలని... ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు పిలుపు నిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని అచ్చంపేటలో భారత్ మాత సత్సంగ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే అనుకున్నది సాధించగలరని అన్నారు. గాంధీ, నెహ్రూ, పటేల్, అంబేడ్కర్ వంటి మహనీయులు, కవులు, క్రీడా ప్రముఖుల విజయాలను చిన్నారులకు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
'పిల్లలు చిన్నప్పటి నుంచి దేశభక్తి కలిగి ఉండాలి' - చాగంటి కోటేశ్వరరావు
విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే అనుకన్నది సాధించగలరని ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. పిల్లలు చిన్నప్పటి నుంచి దేశభక్తిని కలిగి ఉండాలని సూచించారు.
పిల్లలనుద్ధేశించి కాకినాడలో చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు