విద్యార్థులు విద్యతోపాటు కళలపట్ల ఆసక్తి కనబరచాలని ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. ప్రముఖుల చరిత్ర ద్వారా ప్రేరణ పొందాలని, సత్ర్పవర్తన కలిగి ఉండాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తిరుమల విద్యాసంస్థల్లో బుధవారం సాయంత్రం ఆయన ప్రసంగించారు. చరవాణి వంటి ఉపకరణాలకన్నా పుస్తక పఠనానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మనిషి తాను ఏమవ్వాలనుకుంటే అది అవ్వగలడని... తన జీవితం తానే తీర్చిదిద్దుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్ తిరుమలరావు దంపతులు, సంస్థ ప్రతినిధులు, సుమారు 5 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.