ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Central Minister: అట్టడుగు వర్గాలు సాధికారత సాధించేందుకు కృషి చేస్తాం: రాందాస్ అథవాలే - రాందాస్ అథవాలే తాజా వార్తలు

సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం, సాధికారత సాధించే విధంగా కృషి చేస్తామని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పర్యటించిన ఆయన..రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను బలోపేతం చేస్తామన్నారు.

అట్టడుగు వర్గాలు సాధికారత సాధించేందుకు కృషి చేస్తాం
అట్టడుగు వర్గాలు సాధికారత సాధించేందుకు కృషి చేస్తాం

By

Published : Nov 1, 2021, 6:31 PM IST

రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పర్యటించిన ఆయన..దివంగత మాజీ లోక్​సబ స్పీకర్ జీ.ఎం.సీ.బాలయోగితో తనకు మంచి స్నేహం ఉండేదని గుర్తు చేసుకున్నారు. బాలయోగి ఘాట్​కు వెళ్లి నివాళర్పించారు. డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజలకు సామాజిక న్యాయం, సాధికారత సాధించే విధంగా కృషి చేస్తామన్నారు.

కాశీ కృష్ణ గొప్ప మానవతావాది

కోనసీమ ప్రాంతానికి చెందిన దివంగత కాశీ కృష్ణ గొప్ప మానవతావాది అని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. కాశీ కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా అమలాపురంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్​లో నిర్వహించిన సంస్మరణ సభలో పాల్గొని నివాళులర్పించారు.

ఇదీ చదవండి

CBN: ఆ ఎన్నికల్లో వైకాపాను ఓడిస్తేనే.. రాష్ట్రానికి రక్షణ: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details