ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తంటికొండ ఆలయం ప్రమాద దృశ్యాలు.. సీసీ కెమెరాలో.. - తంటికొండ తాజా ప్రమాదం

తంటికొండ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. నిలిపి ఉన్న వాహనం ఒక్కసారిగా ముందుకు కదిలి లోయలో పడింది. ముగ్గురు వ్యక్తులు దూకేయ్యగా మిగిలిన వారు మరణించారు.

CCTV footage of the accident
ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం

By

Published : Nov 1, 2020, 11:05 AM IST

Updated : Nov 2, 2020, 12:00 PM IST

తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో... శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదం దృశ్యాలు... సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. వివాహం అనంతరం కుటుంబ సభ్యులందరూ...ఇళ్లకు వెళ్లేందుకు వాహనం ఎక్కారు. పెళ్లి మండపం దగ్గర ఉన్న కానుకలు, ఇతర సంచులు వ్యానులో సర్దే క్రమంలో వాహనం ఒక్కసారిగా ముందుకు కదిలింది. బండిలో ఉన్న ముగ్గురు కిందకు దూకగా...మిగిలిన వారు మరణించారు.

ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం

ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని రవాణా శాఖ అధికారులు తేల్చారు. ప్రయాణికులు వాహనం ఎక్కిన తర్వాత న్యూట్రల్ పెట్టి హ్యాండ్ బ్రేక్ వెయ్యక పోవడమే కారణమని నిర్ధారించారు. 15 అడుగుల పై నుంచి మెట్ల మీదుగా కిందకు బోల్తా కొట్టిన ఘటనలో 7 చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వరుడి పెద్ద సోదరి ఈ తెల్లవారుజామున మృతి చెందింది. దీంతో మరణించిన వారి సంఖ్య 8 కి చేరింది. ఈ ఘటనతో కళ్యాణ వెంకటేశ్వరుడి కొండపైకి వాహనాలను నిషేధించారు. ఇవాళ ఆలయంలో సంప్రోక్షణ నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండీ...పెళ్లి వేడుకకు హాజరై.. పరలోకానికి చేరి..

Last Updated : Nov 2, 2020, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details