తూర్పుగోదావరి జిల్లా తునిలో 3 కరోనా పాజిటివ్ కేసులుు వెలుగు చూడడంపై.. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పట్టణంలో ని. గొల్లప్పారావు సెంటర్, గర్ల్స్ హై స్కూల్ సెంటర్, పార్క్ సెంటర్, పెద్ద వీధి, పాత బజారు వీధి తదితర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా అమర్చి పరిస్థితి అనుక్షణం సమీక్షిస్తున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని.. నిబంధనలు అతిక్రమించవద్దని కోరారు.
సీసీ కెమెరాల నిఘా మధ్య తుని - తునిలో మూడు పాజిటివ్ కేసుల
తూర్పు గోదావరి జిల్లా తునిలోని రెడ్ జోన్లలో ప్రజల కదలికలపై అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సీసీ కెమెరాలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
![సీసీ కెమెరాల నిఘా మధ్య తుని east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7079055-818-7079055-1588743712663.jpg)
సీసీ కెమెరాలు నిఘా మధ్య తుని.