CBN Breakfast Fruit salad : రాజమండ్రి జైలులో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్ ను ఆయన సిబ్బంది తీసుకెళ్లారు. చంద్రబాబుకు ఇంటి భోజనం అనుమతి ఉండటంతో కుటుంబ సభ్యులు ఫ్రూట్ సలాడ్ ను ఆహారంగా పంపారు. అల్పాహారం తర్వాత తాగేందుకు వేడి నీళ్లు, బ్లాక్ కాఫీ తీసుకెళ్లారు. అలాగే మధ్యాహ్నం భోజనం గా100గ్రాములబ్రౌన్ రైస్,బెండకాయవేపుడు,పన్నీరుకూర,పెరుగును కుటుంబ సభ్యులు జైలు అధికారులకుఅందజేశారు.మధ్యాహ్నంమూడు గంటలకు టీ తాగేందుకువేడి నీళ్లు కూడా అందించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. చంద్రబాబును ఉంచిన స్నేహ బ్లాక్ ఎదురుగానే జైలు ఆసుపత్రిలో పరీక్షలు చేయనున్నారు. చంద్రబాబుతో ముగ్గురు కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు. భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి ములాఖత్ ( Mulakat) కు అధికారులు అనుమతినిచ్చారు.
నాలో కోపం కట్టలు తెంచుకుంటోంది.. చేయని నేరానికి తన తండ్రిని అన్యాయంగా రిమాండ్ చేయడం చూసి కోపం కట్టలు తెంచుకుంటోందని, రక్తం మరుగుతోందని నారా లోకేశ్ ట్వీట్ ( Nara Lokesh's tweet) చేశారు. కక్షసాధింపు చర్యలు, విధ్వంసక రాజకీయాలకు ఆయన ఎప్పుడూ పాల్పడలేదని లోకేశ్ గుర్తు చేశారు. దేశం, రాష్ట్రం, తెలుగు ప్రజల కోసం ఎంతో చేసిన వ్యక్తి.. ఇలాంటి అన్యాయాన్ని ఎందుకు భరించాలి..? రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమం, అవకాశాలను ఆయన ఇతరులకంటే ముందుగా ఊహించినందుకేనా? అని ప్రశ్నించారు. బరువెక్కిన హృదయంతో, కన్నీటితో తడిసిన కళ్లతో రాస్తున్నానని పేర్కొన్నారు.
Live Updates: చంద్రబాబు రిమాండ్ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్