ఈటీవీ భారత్ కథనానికి స్పందన... నిబంధనలు ఉల్లఘించిన మార్టుపై కేసు
కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. అయితే పలుచోట్ల దుకాణదారులు...అధికారులు, పోలీసులు చెప్తున్నా సూచనలు పాటించటంలో అలసత్వం కనపరుస్తున్నారు. తునిలోని ఓ ప్రైవేట్ దుకాణంలో సామాజిక దూరం పాటించకపోవటం, ప్రజలను అధిక సంఖ్యలో దుకాణంలో అనుమతించటం చేశారు. ఈ ఘటనపై ఈటీవీ భారత్ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంతో పోలీసులు.. బాధ్యులను అరెస్ట్ చేశారు.
కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. అయితే కొంత మంది దుకాణదారులు... పోలీసులు, అధికారులు చెప్తున్న కనీస సూచనలు ఏమాత్రం పాటించడంలేదు. అలాంటి వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కొన్ని దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించడం లేదు. తునిలో ఓ మార్ట్లోకి అధిక సంఖ్యలో ప్రజలను అనుమతించడం, సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయకపోవటంతో దుకాణ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.