ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ ఇసుక అమ్మకాలు సాగిస్తున్న వారిపై కేసు నమోదు - ఆత్రేయపురంలో 11 మందిపై కేసు నమోదు

అక్రమంగా ఇసుక అమ్మకాలు సాగిస్తున్న 11 మందిపై తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి నుంచి 28 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.

ఇసుక అమ్మకాలు సాగిస్తున్న 11 మందిపై కేసు నమోదు
ఇసుక అమ్మకాలు సాగిస్తున్న 11 మందిపై కేసు నమోదు

By

Published : Dec 6, 2020, 2:02 AM IST

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం రాజవరం గోదావరి రేవులో ఇసుక అమ్మకాలు సాగిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేవులోని ఇసుకను.. మూటల్లో కట్టి విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం రావటంతో పోలీసులు, స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. 11 మందిపై కేసు నమోదు చేసి 28 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కృష్ణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details