రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తికి కరోనా పాజిటివ్ - మహేంద్రవాడ వార్తలు
రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినా సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి మండలం మహేంద్రవాడలో చోటు చేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం మహేంద్రవాడలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి(49) ఈ నెల 23న రోడ్డు ప్రమాదానికి గురైయ్యాడు. వెంటనే కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ముందస్తుగా కరోనా పరీక్షలు నిర్వహించారు. శుక్రవారం అతనికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. కాకినాడ నుంచి అతనిని రాజానగరంలోని జీఎస్ఎల్ ఆసుపత్రికి తరలించారు. మహేంద్రవాడ గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలటంతో గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్యాధికారి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు.
ఇది చదవండిపుల్లేటికుర్రులో పది నెలల చిన్నారికి కరోనా