తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో అదుపులో ఉన్న ఓ నిందితుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. రెండు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిబ్బందికి కరోనా భయం వెంటాడుతుంది. సిరి ఎంటర్ ప్రైజెస్ పేరుతో రవీంద్ర అనే ఏజెంటు పిఠాపురం పరిసర ప్రాంతాల్లో లక్కీ స్కీమ్ పేరుతో వందల మంది వద్ద నగదు కట్టించుకుని మోసం చేశాడు. మోసపోయామని గుర్తించిన బాధితులు ఇటీవల పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కొత్తపల్లి, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కరోనా భయం - తూర్పు గోదావరి జిల్లా వార్తలు
పోలీస్ స్టషన్లో ఉన్న ఒక నిందితునికి కరోనా రావటంతో తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలిసిన తక్షణమే రెండు పోలీస్ స్టేషన్లు శుభ్రం చేశారు.
కొత్తపల్లి, పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్లో కరోనా భయం
కేసు నమోదు చేసిన పోలీసులు రవీంద్రను అదుపులో తీసుకుని పిఠాపురం, కొత్తపల్లి పోలీస్ స్టేషన్లలో ఉంచారు. గురువారం అతనికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావటంతో పోలీసు అధికారుల్లో ఆందోళన మొదలైంది. తక్షణమే రెండు పోలీస్ స్టేషన్ను శుభ్రం చేసి చర్యలు తీసుకున్నారు. అయితే అతను స్టేషన్లోనే ఉండటంతో సిబ్బందికి సోకిందా అనే ఆందోళనలో సిబ్బంది భయపడుతున్నారు.
ఇదీ చదవండిఅన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న మంత్రి బొత్స