ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుద్ద గెడ్డ వాగులో చిక్కుకున్న కారు..రక్షించిన పోలీసులు - తూర్పుగోదావరి సుద్ధ గెడ్డ వాగులో చిక్కుకున్న కారు

తూర్పుగోదావరి జిల్లా లంపకలోవ సమీపంలోని సుద్ద గెడ్డ వాగులో కారుతో సహా ఓ వ్యక్తి చిక్కుకున్నారు. వాగు ఉద్ధృతంగా ఉండడం వల్ల కారు ప్రవాహంలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని కారుతో సహా వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

car trapped in suddagedda canal
car trapped in suddagedda canal

By

Published : Oct 20, 2020, 11:07 PM IST

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ గ్రామానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి లంపకలోవలో ఓ శుభ కార్యానికి హాజరై కారులో తిరిగి వస్తూ సుద్ద గెడ్డ వాగులో చిక్కుకున్నారు. వాగు ప్రవాహంలో కారు చిక్కుకుంది. విషయం తెలుసుకున్న ప్రత్తిపాడు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. వ్యక్తిని కారుతో సహా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

ABOUT THE AUTHOR

...view details