ఆగి ఉన్న కారులో మంటలు చెలరేగి దగ్ధమైన ఘటన ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జడ్పీ సెంటర్‌లో చోటు చేసుకుంది. ఆ సమయంలో కారులో వృద్ధ దంపతులు ఉండగా సమీపంలో ఉన్న పోలీసులు వెంటనే అప్రమత్తమై వారిని రక్షించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కాకినాడ డీఎస్పీ భీమారావు, ట్రాఫిక్ డీఎస్పీ మురళీకృష్ణ ఘటనాస్థలికి చేరుకుని రాజమహేంద్రవరానికి చెందిన వృద్ధ దంపతులను పరామర్శించారు. సాంకేతిక లోపం కారణంగా కారులో మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు. బాధితులు రాజమహేంద్రవరానికి చెందిన రిటైర్డ్ ఎండోమెంట్ అధికారి రాజేంద్రన్ దంపతులుగా పోలీసులు వెల్లడించారు.
FIRE IN CAR: కారులో మంటలు.. వృద్ధ దంపతులను కాపాడిన పోలీసులు - east godvari news
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వృద్ధ దంపతులు ప్రయాణిస్తున్న ఓ కారులో మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న పోలీసులు వారిని రక్షించారు. సాంకేతిక కారణాలే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.
CAR IN FIRE