తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం జాతీయ రహదారి వద్ద ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఆటోను.. కారు వేగంగా వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. ఆటో పక్కనే ఉన్న మురికి కాలువలోకి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. వీరు కొత్తపేట మండలం వాడపాలెంకు చెందినవారు. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటోను ఢీ కొన్న కారు.. ఐదుగురికి గాయాలు - తూర్పుగోదావరి జిల్లా రోడ్డు ప్రమాదం తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి.
జాతీయ రహదారిపై ఆటోను ఢీకొట్టిన కారు
Last Updated : Jan 1, 2020, 10:28 AM IST