ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసు స్టేషన్​లోని కారు ఇంజిన్ మాయం..పోలీసుల ప్రమేయం ఉందా! - prattipadu news

ఓ కేసులో స్వాధీనపరుచుకున్న కారు.. పోలీస్ట్ స్టేషన్​లో ఉండగా ఇంజిన్ మాయం అవడంపై సామాజిక కార్యకర్తలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇది పోలీసుల ప్రమేయంతోనే జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.

car engine missing in east godavari
పోలీసు స్టేషన్ లోని కారు ఇంజిన్ మాయంపై విచారణ

By

Published : Jun 3, 2021, 10:43 PM IST

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు పోలీసులు ఒక గంజాయి కేసులో స్వాధీనం చేసుకున్న కారు ఇంజిన్ మాయమైన ఘటనలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న కారు ఇంజిన్​ను అసలు దుండగులు ఎలా ఎత్తుకెళ్లారనే కోణంలో విచారణ జరుగుతోంది.

స్థానిక సామాజిక కార్యకర్తలు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. పోలీసులే దానిని అమ్మేసి ఉంటారని వారు ఆరోపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details