ఒకటి తప్పింది.. మరొకటి బలి తీసుకుంది! - రాజమహేంద్రవరంలో కారు ప్రమాదం తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా...కొత్తపేట మండలం వద్ద కారులో వెళ్తున్న నయీం ఒక ప్రమాదాన్ని తప్పించబోయి.. మరో ప్రమాదంలో బలయ్యాడు. ఎదురుగా వెళ్తున్న లారీలో నుంచి కంకర.. రహదారిపై పడిపోవడాన్ని గమనించి తప్పించబోయాడు. ఎదురుగా వస్తున్న వ్యాన్ ను బలంగా ఢీకొట్టాడు.
![ఒకటి తప్పింది.. మరొకటి బలి తీసుకుంది!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4976239-thumbnail-3x2-acci.jpg)
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం మోడేకురు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో.... ఒక వ్యక్తి మృతి చెందాడు. నలుగురికి గాయాలయ్యాయి. రాజమహేంద్రవరానికి చెందిన అబ్దుల్ నయీమ్ అనే వ్యక్తి.. కారులో అమలాపురం వెళ్తున్నాడు. మోడేకురు వద్దకు వచ్చేసరికి... ముందు వెళ్తున్న లారీలో నుంచి.. కంకర రహదారిపై పడిపోవడాన్ని గమనించాడు. ఆ కంకరను తప్పించబోయి ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను బలంగా ఢీకొట్టాడు. ప్రమాదంలో నయీం అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని అమలాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
TAGGED:
ACCIDENT news in kothapet