చల్లగాలి కోసం వాహనం నుంచి తల బయటకు పెడితే విద్యుత్తు స్తంభం తగిలి యువతి దుర్మరణం పాలైంది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, యువతి స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది మంది స్నేహితులు పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నం నుంచి ఒక కారులో శనివారం మారేడుమిల్లి విహార యాత్రకు బయలుదేరారు. మధురపూడి విమానాశ్రయం గేటు - బూరుగుపూడి గ్రామం మధ్య ప్రయాణిస్తున్న సమయంలో వల్లభనేని లోహిత్ రాణి(25) చల్లగాలి కోసం కారు కిటికీ నుంచి తల బయటకు పెట్టారు. అదే సమయంలో కారు రోడ్డు అంచు దిగడంతో పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభానికి ఆమె తల బలంగా తగిలింది. స్నేహితులు వెంటనే అదే కారులో రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందారు. కోరుకొండ ఎస్సై కట్టా శారదాసతీష్ సంఘటన వివరాలను సేకరించారు.
Crime News: కారులోంచి తల బయటపెడితే.. ప్రాణమే పోయింది - car accident
తూర్పు గోదావరి జిల్లాలో ఘోరం జరిగింది. చల్లగాలి కోసం వాహనం నుంచి తల బయటకు పెడితే ప్రాణమే పోయింది. తూర్పుగోదావరి జిల్లా గౌరీపట్నం సమీపంలో జరిగిన ఈ విషద ఘటన వివరాలిలా ఉన్నాయి.
స్నేహితురాలి వివాహానికి వచ్చి..
వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది స్నేహితులు రావులపాలెంలో జరిగే స్నేహితురాలి వివాహం కోసం వచ్చారు. వీరు వల్లభనేని లోహిత్ రాణి స్వగ్రామం గౌరీపట్నంలో బస చేశారు. విహార యాత్రకు వచ్చిన క్రమంలో దుర్ఘటన జరిగింది. లోహిత్ రాణితో పాటు మరో ఆరుగురు చెన్నైలో సీఏలుగా పనిచేస్తున్నారు. మరో ఇద్దరు బీటెక్ చేశారు. మృతురాలి తల్లిదండ్రులు సర్వేశ్వరరావు, అనంతలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్నారు. వీరికి లోహిత్ రాణి ఒకరే సంతానం.