ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో గుప్పుమంటున్న గంజాయి.. పోలీసుల తనిఖీలు ముమ్మరం - cannabis seized in vizainagaram district

రాష్ట్రంలో గంజాయి వినియోగం రోజురోజుకీ పెచ్చరిల్లుతోంది. పలు జిల్లాల్లో పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడుతోంది.

గంజాయి స్వాధీనం
గంజాయి స్వాధీనం

By

Published : Nov 11, 2021, 7:46 PM IST

రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల గంజాయి పట్టుబడుతోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం బోయపాడు జంక్షన్ వద్ద రూ.18 లక్షల విలువైన 605 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పరివర్తన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ వెల్లడించారు.

విజయనగరం జిల్లాలో పోలీసుల నుంచి తప్పించుకున్న గంజాయి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మెంటాడ మండలం ఆండ్ర పరిధిలో కార్లలో గంజాయి తరలిస్తుండగా... పోలీసులను చూసి దుండగులు పారిపోయారు. వారిని గజపతివరం వద్ద పోలీసులు పట్టుకున్నారు. 2 కార్లను సీజ్ చేసిన పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పోలీసులను చూసి పరారయ్యారు.

కృష్ణా జిల్లా మొవ్వ మండలం కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిడుమోలు గ్రామంలో 46 వేల ఖరీదు చేసే 2.680. గ్రాముల గంజాయి కూచిపూడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:

భారీగా డ్రగ్స్ పట్టివేత... ట్యాబ్లెట్ల రూపంలో.. ఫొటో ఫ్రేమ్స్​లో

ABOUT THE AUTHOR

...view details