ఉత్తర్ప్రదేశ్ హత్రాస్ జిల్లాలో యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తూర్పగోదావరి జిల్లా కాకినాడలో ఐద్వా, ప్రగతిశీల మహిళా సంఘం, ఎస్ఎఫ్ఐ, జమాత్ హిందూ ఇస్లాం, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ మహిళా సంఘాల నిరసన చేపట్టాయి. స్థానిక అంబేద్కర్ భవనం నుంచి కలెక్టరేట్ మీదుగా ఇంద్రపాలెం బ్రిడ్జి అంబేడ్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ముందుగా బాధిత యువతికి నివాళులు అర్పించారు. మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు.
'నిందితులను కఠినంగా శిక్షించాలి' - ఉత్తర్ ప్రదేశ్ రేప్ కేసుపై వార్తలు
ఉత్తర్ప్రదేశ్ హత్రాస్ అత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఐద్వా, ప్రగతిశీల మహిళా సంఘం, ఎస్ఎఫ్ఐ, జమాత్ హిందూ ఇస్లాం, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ మహిళా సంఘాల నిరసన చేపట్టాయి.
మహిళా సంఘాల కొవ్వొత్తుల ర్యాలీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నాయని, ఉన్న నిర్భయ చట్టం సక్రమంగా అమలు చేయడం లేదని మహిళా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్రాస్ యువతి అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఏపీలో ఎస్సీలపై పెరిగిన నేరాలు.. మహిళలపై దాడులూ అత్యధికం