భీకర ప్రవాహంతో ప్రవహించి తీరప్రాంతాన్ని ముంచేసిన గోదారమ్మ మరింత శాంతించింది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద రాత్రి ఏడు గంటల సమయానికి 10.8 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. 8లక్షల 84వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వదులుతున్నారు. ఇవాళ ఒక్కరోజే 12 గంటల వ్యవధిలో సుమారు మూడున్నర లక్షలకు పైగా క్యూసెక్కుల ప్రవాహం తగ్గుదల నమోదైంది. మొదటి , రెండు ప్రమాద హెచ్చరికలు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఎత్తివేశారు. అయితే మన్యంలోని దేవీపట్నం మండలం ఇంకా ముంపులోనే ఉంది. ప్రజలంతా వరదనీటిలో అవస్థలు పడుతున్నారు. కోనసీమలోనూ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల నుంచి వరదనీరు క్రమంగా తగ్గుతోంది. వరద నీటి నుంచి కాజ్‌వేలు సోమవారం బయటపడే అవకాశం ఉంది. పంటనష్టంపై వ్యవసాయశాఖ త్వరగా అంచనాలు రూపొందించి పరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు.
తగ్గిన గోదారి ఉద్ధృతి.. ప్రమాద హెచ్చరికలు రద్దు - Cancel danger instuction at Dhavaleswaram Dam
ఇన్ని రోజులు వర్షాల ధాటికి ఉప్పొంగిన గోదారమ్మ కాస్తా నెమ్మదించింది. నేడు ఒక్కరోజు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10.8 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. ఈ సందర్భంగా అదికారులు మెుదటి, రెండు, ప్రమాద హెచ్చరికలు ఉపసంహరించారు.
![తగ్గిన గోదారి ఉద్ధృతి.. ప్రమాద హెచ్చరికలు రద్దు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4108523-144-4108523-1565538115625.jpg)
ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ప్రమాద హెచ్చరికలు రద్దు