కేంద్ర పాలిత పుదుచ్చేరి అసెంబ్లీకి మంగళవారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేటితో ప్రచార గడువు ముగిసింది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను కలిసేందుకు గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు. చివరి అంకంలో ప్రచారం జాతరను తలపించింది.
ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు... రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రంగస్వామి పోటీలో నిలవడం.. పుదుచ్చేరి రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమైంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైన ఆయన తరఫున.. రాష్ట్రానికి చెందిన మంత్రులు, రాజ్యసభ సభ్యులు సైతం ప్రచారం చేశారు.