ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాంలో ఎన్నికల ప్రచారం ప్రారంభం - శాసనసభ ఎన్నికలకు యానాంలో ప్రచారం మొదలు

పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికలు జరగనుండగా.. యానాంలో ప్రచారం జోరందుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రంగసామి ఇక్కడ నుంచి బరిలోకి దిగనున్నారు. ఆయన తరపున మాజీ మంత్రి కృష్ణారావు.. స్థానిక ఓటర్లను కలిసి పార్టీ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు.

election campaign started in yanam
యానాంలో ఎన్నికల ప్రచారం ప్రారంభం

By

Published : Mar 12, 2021, 5:09 PM IST

కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి 15వ శాసనసభకు నేటి నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడంతో.. ప్రధాన పార్టీల నాయకులు ప్రచారం ప్రారంభించారు. యానాం అసెంబ్లీ స్థానానికి.. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఎన్​ఆర్​ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రంగసామి పోటీచేయనున్నారు. ఈనెల 15 లేదా 17న పుదుచ్చేరి నుంచి వచ్చి రిటర్నింగ్ అధికారికి నామినేషన్​ సమర్పించనున్నారు.

రంగసామి తరపున అభిమానులతో కలిసి యానాం మాజీ శాసనసభ్యులు, మాజీమంత్రి మల్లాడి కృష్ణారావు ప్రచారం మొదలుపెట్టారు. సెంటిమెంట్​గా దరియాలతిప్ప రామాలయంలో మల్లాడి పూజలు నిర్వహించారు. స్థానిక ఓటర్లును కలిసి పార్టీగుర్తైన జగ్గుకు ఓటువేయాలని అభ్యర్థించారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు.

మొదటిరోజు బోణీ కాలేదు...

నేటి నుంచి 17 వరకు నామినేషన్​ల స్వీకరణ జరుగుతుందని రిటర్నింగ్ అధికారి అమన్ శర్మ తెలిపారు. శని, ఆదివారం సెలవులని పేర్కొన్నారు. మొదటిరోజు ఒక్క నామినేషనూ దాఖలు కాలేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:అవినీతిని ఎండగట్టినందుకు కేసులు పెడతారా..?: లోకేశ్

ABOUT THE AUTHOR

...view details