విశాఖపట్నం నుంచి అమలాపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం మహిపాల చెరువు వద్ద అదుపు తప్పింది. రోడ్డు ప్రక్కన ఉన్న గృహాల వైపు దూసుకుపోయింది. డ్రైవర్ నిద్రమత్తులో బస్సు నడపటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బస్సులో ప్రయాణికులందరూ సురక్షితంకాగా.. డ్రైవర్‌కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతణ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ముమ్మడివరం వద్ద ఇళ్ల పైకి దూసుకెళ్లిన బస్సు .. తృటిలో తప్పిన ప్రమాదం - తూర్పు గోదావరి బస్సు ప్రమాదం
తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్లో బస్సు అదుపుతప్పి గృహాలపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగా.. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
ఇళ్ల పైకి దూసుకెళ్లిన బస్సు .. తృటిలో తప్పిన ప్రమాదం