ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ACCIDENT: ఊడిన బస్సు వెనుక చక్రాలు.. తప్పిన పెను ప్రమాదం - తూర్పు గోదావరి జిల్లా

గోకవరంలో తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పాతకోట వెళ్తున్న ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడిపోయాయి.

ఊడిన బస్సు వెనుక చక్రాలు
ఊడిన బస్సు వెనుక చక్రాలు

By

Published : Sep 4, 2021, 3:27 PM IST

తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. గోకవరం నుంచి పాతకోట వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు వెనుక చక్రాలు ఊడి పక్కకు వెళ్లిపోయాయి. దీంతో బస్సు అక్కడే నిలిచిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు.. ప్రయాణికులను వేరే వాహనంలో గమ్యస్థానాలకు చేర్చారు.

ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మంత్రి పేర్ని నాని ఆరా తీశారు. బస్సుల ఫిట్‌నెస్‌ విషయాల్లో తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కాగా బాధ్యులపై చర్యలకు ఆదేశించినట్లు మంత్రికి ఆర్టీసీ ఎండీ వివరించారు.

ఇదీ చదవండి:ARREST: గంజాయి ముఠా గుట్టురట్టు.. ఐదుగురు అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details