ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా వాతావరణ పరిరక్షణపై ప్రత్యేక ప్రదర్శనలు జరిగాయి. కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో ఉమర్ అలీషా విశ్వ విజ్ఞాన విద్యాపీఠం ఆధ్వర్యంలో ఐదు కిలో మీటర్ల పరుగు నిర్వహించారు. వాకపల్లిలోని విద్యాపీఠం నుంచి బోట్ క్లబ్ పార్కు వరకూ ఈ ర్యాలీ కొనసాగింది. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు సభ్యులు 'చెట్లను పెంచు.. ఆరోగ్యాన్ని పంచు' నినాదాలతో బ్యానర్లు ప్రదర్శించారు. సర్పవరం కూడలిలో మానవహారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వాతావరణ పరిరక్షణపై శ్రద్ధ తీసుకోవాలని నినాదాలు చేశారు.
చెట్లను పెంచు... ఆరోగ్యాన్ని పంచు - ప్రపంచ పర్యావరణ దినోత్సవం
తూర్పుగోదావరి జిల్లాలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా వాతావరణ పరిరక్షణపై ర్యాలీలు నిర్వహించారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సభ్యులు నినాదాలు చేశారు.
చెట్లనుపెంచు...ఆరోగ్యాన్ని పంచు