తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడుకు పది కిలోమీటర్ల దూరంలో వన్నెపూడి గ్రామంలో ధనకొండ ఉంది. ఆ కొండపై బౌద్ధ స్తూపం ఉంది. దశాబ్దం క్రితం బౌద్ధ ఆరామ ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న.. ఈ ఆరామాలు.. బౌద్ధ మత ప్రచారంలో భాగంగా నిర్మించినట్లుగా తెలుస్తోంది. బౌద్ధ భిక్షువులు ఇక్కడ నివాసం ఉన్నట్లుగా స్థానికులు చెబుతారు. అప్పట్లోనే గుర్రాలు నీరు తాగే కొలనులు ఏర్పాటు చేశారు. ధనకొండగా పేరొందిన మెట్టపై ఈ స్థూపాలు ఉన్నాయి. పురావస్తు శాఖ ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా పర్యటక ప్రాంతంగా బౌద్ధ స్తూపాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
వన్నెపూడిలో బౌద్ధ ఆనవాళ్లు.. బాగోగులు చూసేదెవరు?
చారిత్రక కట్టడాలు. చరిత్రకు సజీవ సాక్షాలు.. భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలు.. అలాంటి కట్టడాలు వర్తమానంలో నిరాదరణకు గురవుతున్నాయి. కోరికలే మనిషి దుఃఖానికి కారణం అని ప్రపంచానికి ఆత్మజ్ఞానం బోధించిన గౌతమ బుద్ధుని ఆనవాళ్లు తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో.. పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
Buddhist Pilgrimage Site in Andhra Pradesh