తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం - కొత్తపేట నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకుని అత్యంత ప్రమాదకరంగా మారింది. జి. పెదపూడి నుంచి అవిడి వెళ్లే మార్గంలో గోరింకల ప్రధాన మురుగు కాలువపై సుమారు 50 ఏళ్ల క్రితం బల్ల వంతెన నిర్మించారు. కాలక్రమేణ ఈ వంతెన శిథిలావస్థకు చేరుకుంది. ఈ వంతెన పరిశీలించిన ఆర్అండ్బీ అధికారులు దీనిపై రాకపోకలను నిషేధించారు. పలువురు గత్యంతరం లేక ఈ మార్గంలో వంతెనపై రాకపోకలు సాగిస్తున్నారు. వంతెన పరిస్థితి బాగోలేదని… ఏ క్షణమైనా కూలిపోయే పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నూతన వంతెన నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
శిథిలావస్థకు చేరుకున్న గోరింకల మురుగు కాలువ పైవంతెన - gorinka main bridge weaken latest news
50 ఏళ్ల క్రితం గోరింకల ప్రధాన మురుగు కాలువపై నిర్మించిన బల్ల వంతెన ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. ఈ వంతెన జి. పెదపూడి నుంచి అవిడికి వెళ్లే మార్గంలో ఉంది. ప్రస్తుతం దీనిపై రాకపోకలను ఆర్అండ్ బీ అధికారులు నిషేధించారు. ఏ క్షణమైనా కూలిపోయే పరిస్థితి ఉన్నందున నూతన వంతెన నిర్మించాలంటూ స్థానికులు కోరారు.
ప్రమదంగా ఉన్న గోరింకల ప్రధాన కాలువపై బల్ల వంతెన