ఒరిగిన వంతెన.. భారీ వాహనాల రాకపోకలు నిలిపివేత - bridge
తూర్పు గోదావరి జిల్లా తాళ్ళరేవు మండలం ఇంజరం వద్ద... పాత వంతెన కొద్దిగా ఒరిగింది. భారీ వాహనాల రాకపోకలను నిలిపేశారు.
bridge-down-in-east-godavari
తూర్పు గోదావరి జిల్లాలోని తాళ్లరేవు వద్ద పాత వంతెన దెబ్బతింది. కాస్త ఒరిగిపోయింది. భారీ వాహనాల రాకపోకలను అధికారులు నిలిపేశారు. 1939లో పంటకాలువపై ఈ వంతెన నిర్మించారు. రామచంద్రాపురం, ద్రాక్షారామం నుంచి యానాం వెళ్లేందుకు ఇదొక్కటే మార్గం. పాత వంతెనకు మరమ్మతులు చేసే అవకాశం లేదని అధికారులు తెలిపారు. కొత్త వంతెన నిర్మించాల్సిందేనని స్పష్టం చేశారు. ఫలితంగా.. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.