గోదావరి నీటి ప్రవాహానికి ముంపు గ్రామాలు, పంట పొలాలతో పాటు ఇటుక పరిశ్రమ కూడా తీవ్రంగా నష్టపోయింది.. ఇటుక బట్టీలు సైతం వరద నీటిలో మునిగిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదార్లంక గ్రామంలో వందల సంఖ్యలో ఇటుక బట్టీ తయారీ కేంద్రాలు ఉన్నాయి. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఇవి ఉండటంతో...వరద ధాటికి ఇవన్నీ పూర్తిగా మునిగిపోయాయి.
వరద వచ్చే...ఇటుకను ముంచే..!
గోదావరి వరద రైతులనే కాదు....ఇటుక తయారీదారులను కూడా తీవ్రంగా నష్ట పరిచింది. తూర్పుగోదావరిజిల్లా కపిలేశ్వరపురం మండంలోని కేదార్లంక గ్రామంలోని వందల సంఖ్యలో ఇటుక బట్టీలు నీట మునిగి... తయారీదారులను కోలుకోలేని దెబ్బతీశాయి.
వరద ముంపు
ఇప్పటికే తయారు చేసి ఉంచుకున్న ఇటుక సైతం వరద నీటిలో నానుతోంది. నీటిలో ఉండటం వల్ల తయారైన ఇటుక పనికిరాదని... లక్షలాది రూపాయలు నష్టం వాటిల్లుతుందని తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.