ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సముద్రంలో స్నానానికి వెళ్లి బాలుడు గల్లంతు - అంతర్వేది వద్ద బాలుడి గల్లంతు

స్నేహితులతో సరదాగా సముద్రంలో స్నానానికి వెళ్లిన బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో జరిగింది. యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

boy missing
సముద్రంలో స్నానానికి వెళ్లి బాలుడి గల్లంతు

By

Published : Mar 7, 2021, 7:48 AM IST

తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది వద్ద సముద్రంలో స్నానం చేస్తుండగా సఖినేటిపల్లి మండలం రామేశ్వరం మొక్క తోటకు చెందిన మేడిది సునీల్ (15) గల్లంతయ్యాడు. మేడిది సురేష్ కుమారుడైన సునీల్... సఖినేటిపల్లి గీతా మందిరం జడ్పీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాల ముగిసిన తర్వాత తన ఐదుగురు స్నేహితులతో కలసి క్రికెట్ ఆడుకుంటామని ఇంట్లో చెప్పి అంతర్వేది వద్ద సముద్ర స్నానానికి వెళ్లారు.

స్నానం చేస్తుండగా ఒక్కసారిగా లోతుకి వెళ్లి సునీల్ మునిగిపోయాడు. సునీల్​ను రక్షించేందుకు ప్రయత్నించినా దొరకలేదని స్నేహితులు చెప్పారు. కుటుంబ సభ్యులకు సమాచారమివ్వగా.. వారు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. తండ్రి, స్నేహితుల ఫిర్యాదుతో ఎస్సై దుర్గ భవాని కేసు నమోదు చేశారు. గల్లంతైన యువకుడి కోసం గాలింపు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details