మండపేటలో బాలుడి అపహరణ.. 7 బృందాలతో గాలింపు - undefined
బాలుడి ఆచూకీ.. తూర్పుగోదావరి జిల్లాలో కలకలం సృష్టించింది. మండపేటలో నిన్న రాత్రి అపహరణకు గురైన చిన్నారి ఆచూకీ.. ఇప్పటికీ లభించకపోవడం.. తల్లిదండ్రుల్లో ఆందోళన పెంచుతోంది.
తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని విజయలక్ష్మినగర్‌లో ఐదేళ్ల బాలుడు జషిత్ ను గుర్తు తెలియని ఇద్దరు దుండగులు అపహరించుకుపోయారు. ఆ ఇద్దరు ముసుగు ధరించి వచ్చారని.. బాలుడి అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో పాటు.. ఉన్న బాలుడిని ఎత్తుకెళ్లారని తెలిపారు. యశ్వంత్ తల్లిదండ్రులు వెంకటరమణ, నాగావళి.. మండపేటలోని వేర్వేరు బ్యాంకుల్లో పని చేస్తున్నారు. తమ బాలుడి ఆచూకీపై వారు ఆందోళనతో ఉన్నారు. రామచంద్రాపురం డీఎస్పీ సంతోష్.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనపై జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం హస్మీ స్పందించారు. 7 బృందాలతో గాలిస్తున్నామన్నారు. అన్ని చెక్ పోస్టులు, బస్టాండు, రైల్వే స్టేషన్లలో అప్రమత్తం చేసినట్టు చెప్పారు. ఇప్పటికే కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. త్వరలోనే బాలుడి ఆచూకీ తెలుసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు
TAGGED:
v