తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఆసుపత్రిలో నవజాత శిశువు మృతిచెందింది. శిశువు మృతికి కారణం ఆసుపత్రి సిబ్బందే అంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గంపేట మండలంలోని మల్లిసాలకు చెందిన ముంతా మాధవి ప్రసవం కోసం గవర్నమెంట్ ఆసుపత్రిలో చేరింది. అయితే రాత్రి సమయంలో విధుల్లో ఉండాల్సిన వైద్యుడు లేకపోవటంతో.. నర్సు శ్రీదేవి ఆమెకు డెలివరీ చేయగా శిశువు మృతిచెందింది. దీంతో కంగారు పడిన ఆసుపత్రి సిబ్బంది తల్లిని, శిశువును ఇంటికి పంపించారు.
మాధవి తండ్రి ఆసుపత్రికి వచ్చి వైద్యులు చేయాల్సిన ప్రసవం నువ్వెందుకు చేశావని నర్సును ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్తోందని బాధితులు తెలిపారు. ఆగ్రహించిన బంధువులు ఆసుపత్రి ఎదుట బైఠాయించి ధర్నా చేశారు.