తూర్పుగోదావరి జిల్లా దెందులూరు మండలం చల్ల చింతలపూడి ఉన్నత పాఠశాలలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. అనంతరం మెక్కలు నాటారు. ఈ సందర్భంగా పాఠశాల, తరగతి గదిలో పెచ్చులు ఊడిపడటం వంటి సమస్యలను ప్రధానోపాధ్యాయుడు ప్రకాశరావు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
చింతలపూడిలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
చింతలపూడి ప్రభుత్వ పాఠశాలలో దెందులూరు శాసనసభ్యుడు కొట్టారు అబ్బయి చౌదరి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు.
books distrubution program at challa chinthalapudi high school in east godavari district